సమయాన్ని వృథా చేయొద్దు
విశ్వంభర, సిద్దిపేట: ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ప్రతీ రోజు క్రమం తప్పకుండా చదవాలని, సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి విద్యార్థులకు సూచించారు. అర్బన్ మండలం వెల్కటూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల ప్రాంగణం మొత్తం కలియతిరిగారు. మైదానంలోని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం బాగుందని ప్రిన్సిపాల్‌ను అభినందించారు. పదో తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అన్ని సబ్జెక్ట్స్ తరగతులు అవుతున్నాయా, మధ్యాహ్న భోజనం బాగుందా అని అడగ్గా అన్ని తరగతులు బాగానే అవుతున్నాయని భోజనం బాగుందని విద్యార్థులు కలెక్టర్‌కు తెలిపారు. గోడపైన రాయించిన తెలుగు వ్యాకరణం, ఇంగ్లీష్ టెన్సెస్, గణిత సుత్రాలు, సైన్స్ సుత్రాలను చూపిస్తూ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. గోడపైన రాసినవి రోజు చూస్తుంటే వాటిని ఎప్పటికీ మర్చిపోకుండా జ్ఞాపకం ఉంటాయని, రోజుకోసారి వాటిని తప్పనిసరిగా చదవాలని తెలిపారు. సమయాన్ని వృధా చేయొద్దని పుస్తక జ్ఞానంతో పాటు రోజు న్యూస్ పేపర్ చదవాలని సూచించారు. పదో తరగతి అనేది జీవితానికి ఓ పునాది వంటిదని ఇక్కడ బాగా చదివి అందరూ ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులు కావాలని, మీ పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు.