పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
విశ్వంభర, తొర్రూరు: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాయిత వీరయ్య కోరారు. ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సమావేశం గురువారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. పందిరి రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కాయిత వీరయ్య మాట్లాడుతూ, పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమస్య అయిన ఈహెచ్‌ఎస్(ఉద్యోగుల ఆరోగ్య పథకం) అమలులో లేదన్నారు. ఉమ్మడి ఏపీలో ఈ పథకం ప్రారంభమైనప్పటికి నేటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. వృద్ధ పెన్షనర్లు రకరకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని, ఆసుపత్రుల్లో చేరిన ప్రతీసారి పెద్దమొత్తంలో బిల్లులు అవుతున్నాయన్నారు. పెన్షనర్లకు రావల్సిన డీఆర్ (డీర్‌నెస్ రిలీఫ్) నాలుగు వాయిదాలు విడుదల చేసి ఏక మొత్తంలో బకాయిలు చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు రావాల్సిన పిఆర్సి మొత్తం పెండింగ్ లో ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు కంచర్ల వెంకటాచారి, కోశాధికారి తుమ్మ నాగేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులు బంధు నారాయణ, తొర్రూరు యూనిట్ ఉపాధ్యక్షులు భిక్షాజీ, నాయకులు రాములు రాజు, చంద్ర ప్రకాష్, నరసింహారెడ్డి, చంద్రశేఖరాచారి , వెంకటరెడ్డి, మిట్ట కోల రవి, వెంకట్ రెడ్డి, రాజగోపాల చారి తదితరులు పాల్గొన్నారు.