విద్యుత్ కోతలను నివారించాలి

విద్యుత్ కోతలను నివారించాలి

  •  సిపిఎం డిమాండ్

 విశ్వంభర , వలిగొండ:  యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో విద్యుత్ కోతలను నివారించాలని, 18 గంటల విద్యుత్ ను అందించాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు.  గురువారం మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామంలో సబ్ స్టేషన్ ముందు విద్యుత్ కోతలను నివారించాలని, 18 గంటల విద్యుత్ ను అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ ఒకవైపు వర్షాలు లేక మరొకవైపు మూసి కాలువల ద్వారా నీరు రాకపోవడంతో గ్రౌండ్ వాటర్ తగ్గి బోర్లలో నీళ్ళు లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో 2-3 గంటల పాటు విద్యుత్తు అందించకపోవడం వల్ల బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న  రైతులు తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వెంటనే విద్యుత్ శాఖ అధికారులు ప్రభుత్వం విద్యుత్ కొతలను నివారించేందుకు తక్షణ చర్యలను చేపట్టాలని అదనపు విద్యుత్తును అందించాలని  డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి గూడూరు బుచ్చిరెడ్డి, మెట్టు రవీందర్ రెడ్డి, చేగురి నరసింహ, ఆకుల మారయ్య, మాడుగుల వెంకటేశం, రోండి మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/avoid-power-cuts/article-18801

Tags: