ఘనంగా పదవీ విరమణ కార్యక్రమం
On
విశ్వంభర, సంగారెడ్డి: రామచంద్రాపురం: బిహెచ్ఎల్ హెచ్‌ఆర్‌డీసీ లో అదనపు ఇంజనీర్‌గా దీర్ఘకాలం పాటు సేవలందించిన తోట వెంకటస్వామి పదవీవిరమణ సందర్భంగా హెచ్‌ఆర్‌డీసీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు, సహచరులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై వెంకటస్వామి,పద్మావతి దంపతులను అభినందించారు. అనంతరం దంపతులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు.



