నాటిన ప్రతి మొక్క బతకాలి.. పచ్చదనం పెరగాలి
- సర్పంచ్ వంగాల స్రవంతి రమేష్
విశ్వంభర, చింతపల్లి: తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ లక్ష్యంగా తెలంగాణకు వన మహోత్సవం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చింతపల్లి మండలంలోని హోమంతాలపల్లి గ్రామంలో సర్పంచ్ వంగాల స్రవంతి రమేష్ ఆధ్వర్యంలో సోమవారం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటడం, ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం పది లక్షల రూపాయల వ్యయంతో గ్రామంలో మహిళా సంఘం నూతన భవనం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ తమ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే తమ ముందు ఉన్న ఉన్నత లక్ష్యమని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముదిగొండ మంజుల అలువాలు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం రమేష్, పంచాయితీ సెక్రటరీ ప్రియాంక, వార్డు సభ్యులు గోవర్ధనాచారి, బత్తిని మధుసుదన్ రెడ్డి, ప్రభాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ ముదిగొండ మహేందర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.