వృద్దాప్యం లో తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదే
- సమస్యల పరిష్కారానికి తక్షణ కృషి
- పోలీస్ ప్రజావాణిలో ఎస్పి నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పి నరసింహ జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఫిర్యాదుదారులతో మాట్లాదారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన వారి నుండి పిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికై సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ ఆదేశాలు, సూచనలు చేసి సమస్యల పరిష్కారానికి అవసరమైన దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు బరోసా కల్పించాలి అన్నారు. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ పిల్లలపై వారసుల బాధ్యత అని, వృద్దాప్యంలో ఉన్న తల్లిదడ్రులను విస్మరించినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలు పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.



