నిందితులను కఠినంగా శిక్షించాలి

నిందితులను కఠినంగా శిక్షించాలి

  • ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి 

విశ్వంభర, ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆత్మకూరు (ఎం) మండల కేంద్రంలోని  భువనగిరి - మోత్కూర్ మెయిన్ రోడ్డు సెంటర్లో నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర గ్రామ మల్లన్న జాతరలో  బేబీ మౌనిక ప్రాణాలను బలిగొన్న ఎనిమిది మందిపై వెంటనే చర్యలు తీసుకొని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆ బేబీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎమ్మార్పియస్, ఎంఎస్పీ, బీసి బలహీన వర్గాల ఆధ్వర్యంలో  కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ మాట్లాడుతూ,  రాష్ట్రంలో దళిత బలహీన వర్గాల ప్రజల పైన విపరీతంగా దాడులు దౌర్జన్యాలు పెరిగిపోవటానికి ఈ సంఘటన పరాకాష్టగా మిగులుతుందని అన్నారు.   రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణం స్పందించి మౌనిక ప్రాణాలను బలిగొన్న దుర్మార్గులపై వెంటనే చర్యలు చేపట్టే విధంగా పోలీస్ శాఖను ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ మజ్జిగ నరేష్, వార్డు మెంబర్ గట్టు విశాల్, బీసీ బలహీన వర్గాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కానుగంటి శ్రీశైలం కురుమ,ప్రజా సంఘాల నాయకులు పైళ్ల గోపాల్ రెడ్డి, ఎమ్మార్పియస్, ఎంఎస్పీ, బీసీ సంఘాల, ప్రజా సంఘాల నాయకులు ఎలగందుల విజయ్ పద్మశాలి, బాబు రజక,శిగ మల్లేష్ గౌడ్, భట్టు సైదులు మాదిగ,బూడిద వెంకన్న గౌడ్, మహేష్, ముప్పిడి పరుశరామ్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

Tags: