మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం 

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం 

విశ్వంభర, ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన గట్టు బిక్షపతి గత పది రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు.బుధవారం రోజు ఆయన దశదినకర్మ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ గ్రామ సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్ 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మజ్జిగ నరేష్ ,మాజీ సర్పంచ్ బీసు చందర్ గౌడ్,మాజీ ఎంపీటీసీ యాస కవిత ఇంద్రారెడ్డి,కోరే బిక్షపతి, అజీముద్దీన్,జయశ్రీ,అబ్బ సాయిలు,నాతి రాజు,వార్డు సభ్యులు,గట్టు విశాల్,బూడిద వెంకన్న,స్వామి,బిజెపి నాయకులు బొబ్బలి ఇంద్రారెడ్డి, గజరాజు కాశీనాథ్, బండారి సత్యనారాయణ, గట్టు శంకర్, కదిరి దశరథ,గట్టు ఇస్తారి, జ్ఞానేశ్వర్, విజయ్,చంద్రయ్య పరుశరాములు, రాజు, రాజేష్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

Tags: