హైదరాబాదులో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం - తెలంగాణ రాష్ట్ర సమితి సమావేశం నేడే
On
విశ్వంభర, హైదరాబాద్ :- అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నేడు (18-12-2025)హైదరాబాదులోని అమృత ఎస్టేట్లో ఐప్స్ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతుందని ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అడ్వైజరీ కమిటీ చైర్మన్ సీకే యాదవ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్సీ మరియు జాతీయ అధ్యక్ష వర్గ సభ్యులు డాక్టర్ డి సుధాకర్ గారెలు హాజరవుతారనీ రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కె.వి.ఎల్ తెలియజేశారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఆహ్వానితులు, గురువారం నాడు 10:30 గంటలకు కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి హాజరై రాష్ట్రంలో ,దేశంలో నెలకొని ఉన్న రాజకీయ, సామాజిక ,యుద్ధ వ్యతిరేక ,శాంతి ఆవశ్యకత , పరిస్థితుల గురించి, రాజ్యాంగ పరిరక్షణ, మానవ హక్కులు, మతసామరస్యం ,సెక్యులరిజం , శాంతి, ప్రజాస్వామ్యం తదితర అంశాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని కె.వి.ఎల్ తెలియజేశారు.
కే.వీ.ఎల్ .
రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి



