బీసీల నిరాహార దీక్షకు సంఘీభావం -గద్దె విజయ్ నేత బిసి గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్
On
విశ్వంభర, హైదరాబాద్ :- బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ టి. చిరంజీవులు ఆధ్వర్యంలో ధర్నా చౌక్ ఇందిరా పార్కు వద్ద చేపట్టిన నిరాహార దీక్షకు బిసి సంఘం గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ , సామాజికవేత్త గద్దె విజయ్ నేత సంఘీభావం తెలిపి మద్దతు పలికారు. బీసీలకు జరిగే అన్యాయం ఇక సహించబోమని వారు అన్నారు. ఈ సందర్బంగా టి చిరంజీవులుకు శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు గుజ్జ సత్యం, దుర్గయ్య గౌడ్, బీసీ చెన్న శ్రీకాంత్ , జాతీయ చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు వెంకన్న నేత, ఇతర బీసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది.



