ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభం
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం కేంద్రంలో వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం టీటెర్డి కల్యాణ మండపం దగ్గర ఏర్పాటు చేసిన ట్రాన్సఫార్మర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ డివిజనల్ ఇంజనీర్ మల్లికార్జున్ గౌడ్, రామన్నపేట ఏ.డి.ఈ శ్రీకాంత్, ఏ.ఈ కోటేశ్వర రావు, రామన్నపేట ఉప-సర్పంచ్ యం.రమేష్, సిబ్బంది యం.నటరాజ్, విజయ కుమార్, మేకల సురేష్, ఎండి చాంద్, యం.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.



