వీధికుక్కల దాడిలో గొర్రెలు మృతి

వీధికుక్కల దాడిలో గొర్రెలు మృతి

విశ్వంభర, ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం కొరటికల్ గ్రామం మధిర రేగులకుంటలో వీధి కుక్కల దాడిలో కొమిరే వెంకన్నకి చెందిన 13 గొర్రెలు మృతి చెందాయి. వీటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని  గ్రామస్తులు తెలిపారు. పేదరికంతో ఉన్న వెంకన్నను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

Tags: