శంషాబాద్‌ సీపీఐకి భారీ షాక్

శంషాబాద్‌ సీపీఐకి భారీ షాక్

  • బీఆర్ఎస్‌లోకి అన్నెపు ప్రభు బృందం చేరిక

 విశ్వంభర, శంషాబాద్:  శంషాబాద్ మండలంలోని కొత్వాల్ గూడ 119వ డివిజన్‌లో సీపీఐ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి కీలకంగా పనిచేసిన రంగారెడ్డి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు అన్నెపు ప్రభు ముదిరాజ్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత 15 రోజుల క్రితం సీపీఐ పార్టీకి రాజీనామా చేసిన అన్నెపు ప్రభు, ఆదివారం రోజున రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ పట్లొల్ల కార్తీక్ రెడ్డి సమక్షంలో తన మిత్రులతో కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో అన్నెపు ప్రభు ముదిరాజ్ (సీపీఐ–ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు), అరుణ్ ముదిరాజ్ (ఆనంద్ గ్రూప్ సీఈవో), బి. లింగం యాదవ్ (సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షుడు), చాంద్ పాషా (ఫాల్స్ సీలింగ్ యూనియన్ అధ్యక్షుడు), శ్రీనివాస్ చారి, శ్రీధర్, దేవేందర్ నాయక్, సతీష్ ముదిరాజ్, రాజు గౌడ్, లోకేష్ నాయక్ (బంజారా మేస్త్రి యూనియన్ అధ్యక్షుడు), మనీష్ పటేల్ (ఇండస్ట్రీస్ లేబర్ యూనియన్ నాయకుడు) తదితర కార్మిక సంఘాల నాయకులు, సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రజా సేవలే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య లక్ష్యాలని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం, అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి, రానున్న రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, మిత్రులు పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-big-shock-for-shamshabad-cpi/article-17425

Tags: