ఓటరు సవరణ ప్రక్రియను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
విశ్వంభర, చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ఇంటింటికీ కొనసాగుతున్న ఓటరు సవరణ ప్రక్రియను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లు తో మాట్లాడి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, నమోదు ప్రక్రియపై ఆరా తీశారు. 2002 , 2025 ఓటరు జాబితాలను ప్రామాణికంగా తీసుకుని అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి, ఓటరు జాబితాలో తమ వివరాలను సరిచూసుకుని అవసరమైన పత్రాలతో ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి సమర్పించాలని అవగాహన కల్పించారు.