ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజులు, పుస్తకాల అమ్మకాలపై చర్యలు తీసుకోవాలి 

  •  జిల్లా కలెక్టర్‌కు ఎంఆర్ హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్ అసోసియేషన్ వినతి 

 విశ్వంభర, జిహెచ్ ఎం సి : ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేయడం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను అధిక ధరలకు విక్రయించడం వంటి అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎంఆర్ హ్యూమన్ రైట్స్ , యాంటీ కరప్షన్ అసోసియేషన్ నాయకులు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి సూచన మేరకు, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ కటాపల్లి ఎల్లేష్ ఆదేశాల మేరకు నాయకుల బృందం కలెక్టర్‌ను కలిసి తమ వినతిని అందజేసింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, హైదరాబాద్ డివిజన్ పరిధిలోని అనేక ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. అదేవిధంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను కూడా తల్లిదండ్రులను బలవంతపెట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ప్రైవేటు పాఠశాలలో తరగతుల వారీగా ఫీజుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని, పాఠ్యపుస్తకాల విక్రయంపై ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని వారు కలెక్టర్‌ను కోరారు. కొంతమంది పాఠశాలలు మొదటి తరగతి పుస్తకాలకే సుమారు రూ.7,000, అలాగే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు రూ.45,000 నుంచి రూ.50,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి శామ్ సుందర్ మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు, పుస్తకాల ధరలతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని అన్నారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన రెండో శనివారం సెలవును కూడా కొన్ని పాఠశాలలు అమలు చేయడం లేదని, విద్యార్థుల శారీరక ఆరోగ్యం దృష్ట్యా వారానికి కనీసం ఒక రోజు పీ.ఈ.టి. (ఫిజికల్ ఎడ్యుకేషన్) తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శామ్ సుందర్, బాలు మహేందర్, చెన్న, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/action-should-be-taken-against-the-high-fees-of-private/article-17346

Tags: