హరీశ్‌రావు ఆత్మీయ కానుక అందజేత
విశ్వంభర, సిద్దిపేట: నియోజకవర్గంలో ఆటో క్రెడిట్ కోఆపరేట్ సోసైటీ సభ్యుల పెళ్లికి ఆటోలక్ష్మి కార్యక్రమం ద్వారా హరీశ్ ఆత్మీయ కానుక ఇస్తున్నట్టు సొసైటీ అధ్యక్షుడు పాల సాయిరాం అన్నారు. లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సొసైటీ సభ్యుడు, ఆటో కార్మికుడు రాజబోయిన రాజు కూతరు వివాహం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు వివాహానికి హాజరై ఆటోలక్ష్మి కింద హరీశ్ అన్న ఆత్మీయ కానుక 5116 రూపాయలను కానుకగా అందజేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 88మంది ఆటోలక్మి కింద ఆటో కార్మికుల కుటుంబాలకు కానుకలను అందజేశామని తెలిపారు. హరీశ్‌రావు సొసైటీని ఏర్పాటుచేసి ఆటో కార్మికులకు ఆర్థిక చేయూతనిస్తూ అండగా నిలుస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో టౌన్ ప్రతినిధులు కిషన్ గౌడ్, కరీం, లింగారెడ్డిపల్లి ఆటో యూనియన్ ప్రతినిధులు, అధ్యక్షుడు సత్తి రెడ్డి, రమేశ్, నాగరాజు, రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు