ఓటు హక్కు పరిరక్షణకు అప్రమత్తంగా ఉండాలి

ఓటు హక్కు పరిరక్షణకు అప్రమత్తంగా ఉండాలి

విశ్వంభర, చిక్కడపల్లి :  ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగబద్ధ హక్కు. ప్రతి ఓటరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొని ఎన్యూమరేషన్ ఫారం సమర్పించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ముషీరాబాదు నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుమార్ నాయక్ పిలుపునిచ్చారు. హైదరాబాదు చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి,లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటు హక్కు కేవలం ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రమే కాకుండా ప్రజల ఆకాంక్షలను పాలనలో ప్రతిబింబించే ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రజలు స్వయంగా తమ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాలను సక్రమంగా నింపి నిర్ణీత గడువులోగా సమర్పించాలని, కొత్తగా అర్హత పొందిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని, చిరునామా లేదా ఇతర వివరాల్లో మార్పులు ఉన్న వారు వెంటనే సవరణలు చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు బీఎల్‌వో సిబ్బంది ద్వారా ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి వాటిని నింపే విధానంపై అవగాహన కల్పించారు. ప్రతి ఓటరు తన ఓటు హక్కును కాపాడుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కుమార్ నాయక్ పిలుపునిచ్చారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/vigilance-should-be-maintained-to-protect-the-right-to-vote/article-17326

Tags: