ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

 విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామానికి చెందిన విద్యార్థులు గురుకుల విద్యాలయాల్లో ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తమ ప్రతిభను కనబరిచినారు. వెల్లంకి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే పది మంది విద్యార్థులు పరీక్ష రాయగా, పదికి పది మంది విద్యార్థులు వివిధ గురుకుల విద్యాలయాల్లో సీట్లు సాధించారు. జిల్లాలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, విద్యార్ధుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags: