కాంగ్రెస్ నుంచి సాయిప్రతాప్ సస్పెన్షన్

కాంగ్రెస్ నుంచి సాయిప్రతాప్ సస్పెన్షన్

విశ్వంభర, సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని కాలకుంట కాలనీకి చెందిన వివాహితపై అత్యాచారానికి యత్నించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయిప్రతాప్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని చెప్పారు. అలాంటి పార్టీలో ఉంటూ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు గాను నియోజకవర్గ ఇన్ ఛార్జి పూజల హరికృష్ణ సూచన మేరకు పార్టీ నుంచి సాయిప్రతాప్ ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. పార్టీలో ఉంటూ ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఊరుకోమని  హెచ్చరించారు. బాధితురాలికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందన్నారు.

Tags: