సర్వేనెంబర్ 126 ప్రభుత్వ భూమిని కాపాడాలి...

WhatsApp Image 2024-07-04 at 5.23.22 PM

విశ్వంభర చివ్వెంల :-కుడ కుడ  గుట్ట చుట్టూ గల సర్వేనెంబర్ 126 లో ప్రభుత్వ భూమిని కాపాడాలని తెలంగాణ జన సమితి మండల అధ్యక్షులు ధారావత్ సుమన్ నాయక్ కోరారు . ప్రభుత్వ భూమిని కాపాడాలని అర్హులైన పేదలకు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ జన సమితి నాయకులతో కలిసి ఆయన గురువారం తహసీల్దార్ కృష్ణయ్య వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుమన్ నాయక్ మాట్లాడుతూ జీవో నెంబర్ 58 ,59 పేరుతో కొంతమంది అక్రమార్కులు లేనివి ఉన్నట్లుగా చూపించి  రెగ్యులర్ చేయించుకున్నారని అలా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ భూమిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వారికి ఇచ్చినటువంటి రెగ్యులరైజేషన్ పట్టాలను తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జన సమితి జిల్లా నాయకులు మల్సూర్ నాయక్,వినయ్ గౌడ్,యాకూబ్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Read More పోలీసు శాఖ పై ప్రజల్లో విశ్వాశం పెరగాలి 

Tags: