గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా : సర్పంచ్ నవీన్   

గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా : సర్పంచ్ నవీన్   

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలోని మార్కెట్ సముదాయములో  రూ.10 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆనెగొని రమేశ్ ఇంటి వద్ద 2.00 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో బోర్ వెల్ డ్రిల్లింగ్, మోటార్ పంప్ సెట్ బిగించడము జరిగింది. ఈ పనులను  గ్రామ సర్పంచ్  మునగపాటి నవీన్, వార్డు సభ్యులు  గ్రామ పెద్దలతో కలిసి ప్రారంబించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్  మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి వార్డులో సీసీ రోడ్డు పనులు, డ్రైనేజీ పనులను విడతల వారీగా పూర్తిచేస్తున్నామని, గ్రామంలో  వేసవి కాలములో ఎక్కడ కూడా త్రాగునీటి ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకొని, ప్రతి వార్డులో బోర్ మోటార్స్ డ్రిల్లింగ్ చేయడముతో పాటు నూతన మోటార్ పంప్ సెట్స్ బిగించడము జరిగిందని తెలిపారు. గ్రామములొని ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా తగిన మౌలిక వసతులు కల్పిస్తానని తెలియజేశారు. స్థానిక శాసన సభ్యురాలు మాజీ రాష్ట్ర  విద్యా శాఖ మంత్రి  సబితా ఇంద్ర రెడ్డి  సహకారముతో మరిన్నినిధులు తీసుకొచ్చి గ్రామాన్ని మరింత అభివృద్ది పరుచుటకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నవీన్,  ఉప సర్పంచ్  జొరల రమేశ్,  వార్డు సభ్యులు తింగిరికారి బేబీ, పోల్కం సునీత, ఆవులకాడి కిష్టామ్మ, స్వర్ణగంటి సంజీవ, మహమ్మద్ ఆజం, కడమోని స్వాతి, వత్తుల శాలిని, కాకి పరమేష్, దిద్దెల శ్రీశైలం, ఆకుల వీరిబాబు, సున్నం స్వప్నా, జటావత్ రుకేష్, రెవెళ్ళ చంద్రమౌళి, అబ్దుల్ జావిద్, మాజీ ఎంపీటీసీ సభ్యులు పోతర్ల సుధర్శన్ యాదవ్, మాజీ పిఎసిఎస్   చైర్మెన్ అంబయ్య యాదవ్ , పిఎసిఎస్  మాజీ వైస్ చైర్మెన్ వెంకటేశ్వర్ రెడ్డి ,నాయకులు కర్రోల్ల చంద్రయ్య , బి ఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కటికలమహేందర్ , ఆవులకడి శ్రీశైలం ,కాడమోని ప్రభాకర్,టింగీర్కరి మక్కజీ ,సున్నం కృష్ణ ,వత్తుల సన్ని కుమార్,  గ్రామ పంచాయతి కార్యదర్శి సుజాత,  గ్రామస్థులు పాల్గొనడము జరిగింది.

Tags: