సీబీఎస్ఈ ఫలితాల్లో జేఎస్ఎం విద్యార్థుల ప్రభంజనం..చైర్మన్ నెమరుగొమ్ముల రమేష్ వెల్లడి

సీబీఎస్ఈ ఫలితాల్లో జేఎస్ఎం విద్యార్థుల ప్రభంజనం..చైర్మన్ నెమరుగొమ్ముల రమేష్ వెల్లడి

విశ్వంభర హనుమకొండ జిల్లా:-సీబీఎస్ఈ బోర్డు ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో హంటర్ రోడ్డు లోని జేఎస్ఎం  స్కూల్ విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తిర్ణత సాధించినట్లు పాఠశాల చైర్మన్ నెమరు గొమ్ముల రమేష్ మీడియాకు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల ఉపాద్యాయులు చక్కటి ప్రణాళికలు రూపొందించి ఒక లక్ష్యంతో విద్యార్థులకు విద్యాబోధన చేశారని తెలిపారు. ప్రకటించిన ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో సిహెచ్.యోశితా రావు 493 మార్కులు సాధించి మొదటి ర్యాంకు,ఆదిత్య నాయక్ 481 మార్కులు,478 మార్కులు కలష్ కన్నా,ప్రేరణ 475 మార్కులు 471 మార్కులు విశ్వనాధ్ రెడ్డి, 470 మార్కులు సిరి 470 సాధించారని, 470 మార్కులకు పైగా 12 మంది విద్యార్థులు,450 కి పైగా 25 మంది విద్యార్థులు మార్కులు సాధించారని తెలిపారు.ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ సతీష్ కుమార్, ప్రిన్సిపాల్స్ శ్రీదేవి, శివకుమార్ లు సైతం విద్యార్థులను అభినందించారు.

Tags: