మే 11న ఛలో ఇల్లందు 

మే 11న ఛలో ఇల్లందు 

  • రైతు సంఘo రాష్ట్ర అధ్యక్షుడు పాయం చిన్న చంద్రన్న పిలుపు 

విశ్వంభర, మహబూబాబాద్:  జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ కార్యాలయం వద్ద  మే  11వ తేదీన  ఇల్లందులో జరిగే  అఖిలభారత ఐక్య రైతు సంఘం  జాతీయ బహిరంగ  మహాసభల  పోస్టర్లను విడుదల చేసి, మహాసభలను  విజయవంతం చేయాలని రైతులను  సంఘo రాష్ట్ర అధ్యక్షులు  చంద్రన్న పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమానికి    ముఖ్యఅతిథిగా అఖిలభారత ఐక్య  రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షులు   పా యం చిన్న చంద్రన్న  హాజరై  మాట్లాడుతూ అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) జాతీయ మహాసభలు ఇల్లందులో, మే 11 న,  వేలాది మందితో ప్రదర్శన బహిరంగ సభ ఉంటుందన్నారు . మరియు  12, 13 వ తేదీ న, 300 మంది ప్రతినిధులు 16 రాష్ట్రాల నుండి హాజరవుతున్నారని ,ఈ సభల విజయవంతనికి కృషి చేయాలని వారు  కోరారు . అమెరికా -భారత్ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలి, కేంద్ర ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన  ఒప్పందాలను అమలు చేయాలి, రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలే ప్రధాన కారణం ఫలితంగా రైతులు చేసిన అప్పులు తీర్చే దారి లేక అర్ధాంతరంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారన్నారు పాలకుల తప్పుడు విధానాల వల్ల రైతులు నష్టపోవడమే కాక పంటలు వ్యాపారుల చేతుల్లోకి పోయి ధరల మంటలు మండుతున్నాయని ఫలితంగా ప్రజలు రైతులు కూలీలు మొత్తం ప్రజలు అన్ని విధాల ఇబ్బంది పడవలసి వస్తున్నదని ధరల భారం అనుభవించవలసి వస్తుందని అన్నారు . ఇల్లందులో అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభలకు ఎంతో ప్రాధాన్యత ఉందనీ  ఈ మహాసభలకు రైతాంగం హాజరై జయప్రదం చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో *అఖిల భారత ఐక్య రైతు సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పూనం ప్రభాకర్ ,  ఆవుల కట్టయ్య  ,జిల్లా నాయకులు తుపాకుల వెంకన్న , గద్దల వెంకటయ్య , బూర్గుల మోస సూరన్న  , వెంకన్న , ప్రసాద్  ,ఎల్లయ్య , రాములు , రమేష్ , తదితరులు  పాల్గొన్నారు .

Tags: