ఇరాన్ పై అమెరికా యుద్ధాన్ని ఆపేయాలి
విశ్వంభర, చింతపల్లి: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ఆపేయాలని, పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను వ్యతిరేకిస్తూ సిపిఐ మండల పార్టీ ఆధ్వర్యంలో చింతపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశవ్యాప్తంగా పెరిగిన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు, తగ్గిన గ్యాస్ సరఫరాతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇందుకు ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం, కేంద్రంలో మోడీ సర్కారు విధాన వైఫల్యాల కారణమని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. అలినోద్యమానికి రూపకర్తలమైన, ప్రపంచమై ప్రపంచ వర్ధమాన దేశాలకు ఆదర్శంగా నిలిచిన భారతదేశ విదేశాంగ విధానం ఇప్పుడు అమెరికా కనుసైగల్లో నడిచే దుస్థితి ఏర్పడడం అత్యంత విచారకరం అని మాజీ ఎమ్మెల్యే ఉజ్జీని యాదగిరి రావు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ చింతపల్లి మండల కార్యదర్శి పోలే వెంకటయ్య, సహాయ కార్యదర్శి ఉజ్జిని అంజలి రావు, మండల కార్యవర్గ సభ్యులు కోడిదాల వెంకటయ్య, షేక్ శంశోద్దిన్, మండల కౌన్సిల్ సభ్యులు జోగు శ్రీరాములు, గుండ్లపల్లి ఇద్ది రాములు, ముదిగొండ లక్ష్మయ్య, ముస్కు వెంకటయ్య, కలకొండ వెంకటయ్య, బాదం మల్లేష్, గండికోట రామకృష్ణ, జక్కుల మల్లేష్, క్రిస్టఫర్, ఆంజనేయులు, వింజమూరి నరసింహ, నల్లగాసు నరసింహ, యాచారం శ్రీశైలం, ఐతపాక సైదులు, యాదయ్య, చేపూరి వెంకటేష్, మల్గం నరసింహ, మెరుగు సత్తయ్య, ఘనిపల్లి రాములు, ఘనిపల్లి జితేంద్ర, ముత్తమ్మ, లక్ష్మమ్మ, ఆదిరాల యశోద తదితరులు పాల్గొన్నారు.



