భారీ శబ్దాలతో మ్యూజిక్.. ఇద్దరిపై కేసు నమోదు
On
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదులాబాద్ ఎమ్మెస్సార్ ఫామ్ హౌస్ లో మంగళవారం తెల్లవారు జామున భారీ శబ్దాలతో మ్యూజిక్ పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు సమాచారం అందగా ఘట్కేసర్ పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని బర్తడే పార్టీ నిర్వాకుడు గైక్వాడ్ బాలాజీ బాలి( 24), ఫామ్ హౌస్ ఓనర్ మధు సూదన్ రెడ్డి (37)లపై కేసు నమోదు చేసారు. సంబంధిత శాఖల నుండి ఎటువంటి చట్టబద్ధమైన అనుమతి లేకుండా, అర్థరాత్రి వేళ భారీ శబ్దాలతో సంగీతాన్ని ప్లే చేస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.



