పిరమిడ్ నిర్మాణానికి వినతి 

పిరమిడ్ నిర్మాణానికి వినతి 

విశ్వంభర, నిజాంపేట్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజాంపేట్ లో ధ్యాన పిరమిడ్ నిర్వహించుటకు కొంత స్థలాన్ని ప్రభుత్వం నుంచి ఇవ్వాలని అఖిల భారత వడ్డెర సంఘం మహిళా అధ్యక్షురాలు కుంచపు రమ వినతిపత్రం అందజేశారు. ఎల్ సి సెక్షన్ సభ్యులకు వినతి పత్రం సమర్పించిన వెంటనే స్పందించిన అధికారులు త్వరలో నిజాంపేట్ పరిధిలో కొంత స్థలాన్ని ధ్యాన పిరమిడ్ కు కేటాయిస్తామని తెలిపారు.

Tags: