అగ్ని ప్రమాదాలపై అవగాహన
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో ఇండియన్ ఆయిల్ కంపెనీ వారి సౌత్ ఈస్టన్ ప్రాంత పైపులైన్ లెవెల్-3లో భాగంగా ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ నిర్వహించారు. అకస్మాత్తుగా పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయి, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలని రైతులకు, స్థానికులకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి, లీడింగ్ ఫైర్ ఫైటర్ ఆర్.బీకూ, డ్రైవర్ ఆపరేటర్ ఎన్.కాశీరాం, ఫైర్ ఫైటర్స్ ఏ.కృష్ణ, సిహెచ్.మధు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



