దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు

దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు

  • అధికారులకు డిప్యూటీ కలెక్టర్ మాలతి ఆదేశం

విశ్వంభర, మేడ్చల్: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ జాప్యం లేకుండా సత్వరమే అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి  జిల్లా భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాలతి  అధికారులను ఆదేశించారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల  దరఖాస్తులను డిప్యూటీ కలెక్టర్ మాలతితో కలిసి జిల్లా అధికారులు  స్వీకరించారు. ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చుకొని వారి సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకంతో ప్రజలు మన వద్దకు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని దరఖాస్తుల పరిశీలనలో ఏలాంటి జాప్యం లేకుండా చూడాలని అన్నారు. అదేవిధంగా తిరస్కరించే దరఖాస్తుల గురించి తిరస్కరణకు గల కారణాలను తప్పనిసరిగా వివరంగా అర్జీదారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యల వివరాలను ఆన్ లైన్ లో వెంట వెంట నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి సుజాత, ఎఫ్ & జి సెక్షన్ సూపరింటెండెంట్ విజయ్, ప్రాజెక్టు డైరెక్టర్ హౌసింగ్ రమణమూర్తి, డిఆర్డిఎ సాంబ శివ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: