ఇరాన్ పై యుద్దోన్మాదాన్ని తక్షణమే ఆపాలి
- సిపిఐ రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు
విశ్వంభర, శంషాబాద్: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం వల్ల దేశంలో పెట్రో గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారని తక్షణమే యుద్ధాన్ని ఆపాలని దీనికి భారత ప్రభుత్వం చొరవ చూపాలని సిపిఐ రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు డిమాండ్ చేశారు. యుద్ధం వద్దు ప్రపంచశాంతి ముద్దు ఇరాన్ పై యుద్దోన్మాదని తక్షణమే ఆపాలని. గ్యాస్ పెట్రో కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ శంషాబాద్ మండల కేంద్రంలో వంట గ్యాస్ పొయ్యి పట్టుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జిహెచ్ఎంసి కేంద్రంలో జాతీయ రహదారి 44 లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శంషాబాద్ మండల కార్యదర్శి యాదగిరి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గల్ఫ్ దేశాలలో ఆయిల్ నిక్షేపాలపై కన్ను వేసిన అమెరికా ఎలాగైనా అక్కడ ఉన్న ప్రభుత్వాలను కూల్చి తమకు అనుకూలమైన ప్రభుత్వాలను తెచ్చుకోవడానికి మాట వినని ఇరాన్ పైన దాడి చేసి ఆ దేశ సుప్రీమును హతమార్చడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. ఇరాన్ పై యుద్ధం వల్ల భారతదేశంలో తీవ్రమైన గ్యాస్ కొరత పెట్రో ఇంధనం కొరత ఏర్పడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఇది భారత ప్రధానికి కనబడడం లేదా అని ఆయన ప్రశ్నించారు యుద్ధం ఇదే విధంగా కొనసాగితే రాబోయే కాలంలో గ్యాస్ ఇంధనం కొరతతో పాటు ఆహార ధాన్యాల కొరత కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు అమెరికా ఆధిపత్యం కోసం జరిగే యుద్ధాలు ప్రపంచ ప్రజలకు నష్టం కలిగిస్తున్నాయని అమెరికా ధన దాహానికి పేద దేశాలు నలిగిపోతున్నాయని ఆయన ఆవేదన చెందారు అమెరికా యుధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని భారత ప్రభుత్వం తటస్థ వైఖరి విడనాడి తన స్నేహితుడైన ట్రంప్ ను ప్రశ్నించాలని ఆయన తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్ యాదగిరి, శంషాబాద్ మండల కార్యదర్శి నర్రగిరి, ఏఐటియుసి మండల కార్యదర్శి గిలక రాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు శ్రీను, ఏఐటియుసి నాయకుడు ప్రవీణ్ కుమార్ గౌడ్, నరేష్ నాయక్ ఇతర కార్మికులు ప్రజలు పాల్గొన్నారు.



