30న మాదిగల చైతన్య సదస్సు
విశ్వంభర, అనంతపురం:ఎస్సీ,ఎస్టీ ప్రజలపై అనునిత్యం ఏదో ఒకచోట, ఏదో ఒక ప్రాంతంలో మర్డర్లు, అత్యాచారాలు, దాడులు జరుగుతూ వున్నాయి, అందుకు సంబంధించిన బాధితులకు న్యాయం జరగాలన్నా, హంతకులకు, నిందితులకు త్వరగా శిక్షపడాలన్నా, ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న అనంతపురం గిరిజన భవన్ లో మాదిగల చైతన్య సదస్సును ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలు ప్రజలు, మాదిగ నాయకులు, అలాగే ఎమ్మార్పీస్ నాయకులు దాదాపు 12 మంది నిర్దాక్షిణ్యంగా హత్యలు జరిగాయని, రాష్ట్రంలో మాదిగలకు రక్షణ ఎక్కడ ఉంది అని వారు ప్రశ్నించారు. 12 మంది మాదిగ బిడ్డలును హత్య లు చేస్తే మాదిగల హోంమంత్రి అనిత కనీసం వారిని పలకరించడానికి , వారి కుటుంబాలను ఓదార్చడానికి వారికి భరోసా కల్పించడానికి ప్రయత్నించిన పాపాన పోలేదు... గతంలో అగ్రకులానికి చెందిన వ్యక్తి హత్య చేయబడితే వారి ఇంటికి వెళ్లి పరామర్శించి వారికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియో ప్రకటించడం జరిగినది. మరి మన బిడ్డల విషయంలో ఈ కార్యక్రమం ఎందుకు చేయలేదని సూటిగా ప్రశ్నిస్తున్నాము. అలాగే ఆర్డిటి సంస్థ ఎఫ్ సి ఆర్ ఏ ను త్వరగా రెన్యువల్ చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుత్తి అంజన ప్రసాద్, ఎం.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జెన్నే చిరంజీవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాకే ఓబులేసు, రాష్ట్ర అధికార ప్రతినిధి మెచ్చిరి జయ ప్రకాష్, యువసేన జిల్లా అధ్యక్షులు శ్రీ రాఘవ, ఎం.ఎస్.ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి సుదర్శన్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాల నాగేంద్ర, రాప్తాడు నియోజకవర్గం అధ్యక్షులు తుముచెర్ల సాకే నర్సింహులు, నార్పల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పవన్ అంజి రాయుడు తదితరులు పాల్గొన్నారు.



