ప్రజావాణికి తప్పనిసరిగా హాజరు కావాలి
- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర, సూర్యాపేట: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొని ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, వివిధ శాఖలలో చాలా కాలం పెండింగ్ లో ఉన్న పిర్యాదులపై శాఖల వారీగా ప్రత్యేక శ్రద్ద పెట్టి పరిష్కరించాలని అలాగే రాష్ట్ర స్థాయి ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను కూడా పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా కలెక్టరేట్ లోని ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే ప్రతి కార్యాలయంలోని ఫైల్స్ అన్ని సక్రమంగా ఉంచుకోవాలని ప్రతి కార్యాలయ సిబ్బంది అటెండెన్స్ తప్పనిసరిగా ఫేస్ రికగ్నేషన్ యాప్ లో నమోదు చేయాలని, కలెక్టరేట్ లోని ప్రతి కార్యాలయం సందర్శిస్తానని, ఫైల్స్ సరిగా లేకపోయినా, శుభ్రంగా ఉండని కార్యాలయాల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 41 దరఖాస్తులు,డిడబ్ల్యుఓ 4, డిపిఓ 3, డి ఆర్ డి ఏ 3', మిగిలిన 17 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం. 68 దరఖాస్తులు వచ్చాయాని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు. అనంతరం సంబంధిత శాఖల దగ్గర ఉన్న పెండింగ్ ఆడిట్ పేరాలను పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి సీఈఓ జడ్పీ శిరీష, జిల్లా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, సిపిఓ కిషన్, డిఇఓ అశోక్, సంక్షేమ అధికారులు నర్సింహారావు, నరసింహ, శంకర్ జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు హాజరైనారు.



