జాతీయ టీకా దినోత్సవం 

జాతీయ టీకా దినోత్సవం 

విశ్వంభర, మహబూబాబాద్:  రోగనిరోధక శక్తిపై అవగాహన వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్ నివారించగల వ్యాధులపై అవగాహనానతో సమాజంలో పిల్లలను, తల్లులను, వ్యక్తులను  రక్షించడంలో టీకా కార్యక్రమం ప్రాముఖ్యత, ప్రధాన పాత్రను  సమాజంలో అందరికీ తెలియ చేస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ నేడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  మాతృ, శిశు మరణాలను గణనియముగా తగ్గించటంలో వ్యాధి నిరోధక టీకాలు ముఖ్య భూమిక వహిస్తాయని, వ్యాధులు నివారించడం, వ్యక్తుల ప్రాణాలను కాపాడటం రోగనిరోధకత ఆధునిక వైద్యంలో అత్యంత శక్తివంతమైన సాధనాలలో ఒకటని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా టీకా ప్రయత్నం కారణంగా 1980లో ప్రపంచవ్యాప్తంగా మశూచి నిర్మూలించబడింది ఇది గొప్ప ప్రజారోగ్య విజయాలలో ఒకటి.   ఒకప్పుడు పోలియో తో వేలాది మంది పిల్లలు పక్షవాతం వచ్చినా, ఇప్పుడు నిర్మూలన అంచున ఉంది,  సార్వత్రిక వ్యాధి నిరోధక టీకా కార్యక్రమము,కారణంగా క్షయ, పోలియో రోట, కంఠ సర్పి, కోరింథ దగ్గు, ధనుర్వతం, మీజిల్స్, , హెపటైటిస్.. బి, ఇన్ఫ్లుఎంజా, ఎల్లో ఫీవర్, వలన వ్యాధులు గణనీయంగా తగ్గాయని అన్నారు.

Tags: