ఎస్వీఎస్ కళాశాలలో టెక్ స్ప్రింగ్ ఫెస్ట్
On
విశ్వంభర, హనుమకొండ: హానుమకొండ రామారం లోని ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో రెండో రోజు టెక్ స్ప్రింగ్ ఫెస్ట్ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు వైస్ చైర్ పర్సన్ డాక్టర్ ఎర్రబెల్లి సువర్ణ తెలిపారు.ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ డాక్టర్ ఎర్రబెల్లి సువర్ణ మాట్లాడుతూ, విద్యార్థులకు సాంకేతిక విద్యతో పాటు సృజనాత్మకతను అభివృద్ధి చేసుకుని భవిష్యత్తులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమానికి హాజరైన మమత హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ విద్యార్థులలో దాగివున్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి టెక్నికల్ ఫెస్టివల్స్ ఎంతోగానో ఉపయోగపడతాయని తెలిపారు.ఈ ఫెస్ట్లో గెలుపొందిన విద్యార్థులకు ఆమె బహుమతులు అందజేశారు.



