ఘనంగా మల్లికార్జున స్వామి ఉత్సవాలు 

ఘనంగా మల్లికార్జున స్వామి ఉత్సవాలు 

విశ్వంభర, సంగారెడ్డి: అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని జానకంపేట్ గ్రామంలో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.ఈ వేడుకల్లో పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్  వెన్నవరం ఆదర్శ్ రెడ్డి  పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆదర్శ్ రెడ్డి కి గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఆదర్శ్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జానకంపేట్ మాజీ సర్పంచ్ పండు యాదవ్, కిష్టారెడ్డిపేట్ మాజీ సర్పంచ్ కృష్ణ, వడిగేపల్లి మాజీ సర్పంచ్ మల్లేష్ పాల్గొన్నారు. అలాగే బీఆర్‌ఎస్ యువ నాయకులు మాణిక్ యాదవ్, సాయి కృష్ణ, శివతో పాటు స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. భక్తుల కోలాహలంతో జానకంపేట్ గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Tags: