రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
విశ్వంభర, సూర్యాపేట: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యాచరణ కార్యక్రమం పురస్కరించుకుని సోమవారం సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో గల ఆర్టీసీ బస్టాండ్ డిపో లో బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు, ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాల్సిన బాధ్యత ఆర్టీసీ డ్రైవర్ల పై ఉన్నదని ట్రాఫిక్ ఎస్ఐ తెలిపారు. నిబంధన ప్రకారం వాహనాలను నడపాలని అతివేగంగా వెళ్లకుండా నిదానంగా వెళ్లాలని సూచించారు, రోడ్డు ప్రమాదాల నివారించడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వాహనాలు నిదానంగా నడపాలని, పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని కోరారు, రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. రోడ్డు ప్రమాదంలో ఏ ఒక్క వ్యక్తి మరణించకూడదని ఇందుకోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా వాహనాలు నడపాలని కోరారు.



