రెండేళ్లలో  బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది 

రెండేళ్లలో  బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది 

  • ఎమ్మెల్యే మల్లారెడ్డి 

విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా  పోచారం చౌదరిగుడాలో   చెరుకు బాలయ్య గార్డెన్ లో పోచారం మాజీ కౌన్సిలర్ బద్దం మమతా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో  మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే  చామకూర మల్లారెడ్డి ,  ఏమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఏమ్మెల్యే కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ,  కాంగ్రెస్ ప్రభుత్వం పనికిరాని హామీలిచ్చి  ప్రజలను మోసం చేసిందని   వచ్చే రెండేళ్లలో  బిఆర్ఎస్ ప్రభుత్వం  వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ  కెసిఆర్ నెరవేరుస్తారని  అన్నారు.  ఈ కార్యక్రమంలో  పీర్జాదిగూడ  మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి   డాక్టర్ భద్రారెడ్డి  డాక్టర్ ప్రీతి రెడ్డి  ,మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బి ఆర్ ఆర్  పార్టీ నాయకులు, మహిళలు , కార్యకర్తలు,  మాజీ సర్పంచ్లు  తదితరులు పాల్గొన్నారు.  చీరల విషయంలో కొందరు మహిళలకు చీరలు అందకపోవడంతో  ఆందోళన చేయడంతో కొద్దిగా  రసాభాస  జరిగింది.

Tags: