విశారదన్ విడుదలకు డిమాండ్

విశారదన్ విడుదలకు డిమాండ్

విశ్వంభర, ఖమ్మం : ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయడానికి ఖమ్మం నుండి బయలుదేరిన బిసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్‌ను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం అన్యాయమని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు ఖండించారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెలుగుమట్ల ప్రాంతంలో భూములు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని, ఇండ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు పునరావాసం కల్పించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని నిర్బంధించినట్లు తెలిపారు. అరెస్టు అనంతరం ఖమ్మం నుంచి కొనిజర్ల పోలీస్ స్టేషన్‌కు, అక్కడి నుంచి వైరా పోలీస్ స్టేషన్‌కు, మళ్లీ మధిర టౌన్ పోలీస్ స్టేషన్‌కు, తరువాత మధిర రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. భూ బాధితుల సమస్యలపై పోరాడటం నేరమా అని ప్రశ్నించారు. విశారదన్ మహారాజ్‌ను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునివ్వాల్సి వస్తుందని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు హెచ్చరించారు.

Tags: