అంగన్వాడీల అరెస్టు అప్రజాస్వామికం

అంగన్వాడీల అరెస్టు అప్రజాస్వామికం

విశ్వంభర,ఇనుగుర్తి:అంగన్వాడీ టీచర్లు,హెల్పర్ల అరెస్టులు అప్రజాస్వామికమని సిఐటియు మండల కార్యదర్శి జల్లె జయరాజ్ అన్నారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం అరెస్టుల పట్ల అంగన్వాడీలతో కలిసి మండల కేంద్రం ఇనుగుర్తి లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సమస్యల పరిష్కారం కోరుతూ హైదరాబాదు వెళుతున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ లను ప్రభుత్వం అరెస్ట్ చేయడం, గృహనిర్బంధాలకు పాల్పడడం దారుణమన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతో సేవ చేస్తున్న అంగన్వాడీలకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కేటాయించి కనీస వేతనం రూ.26వేలు, 25 లక్షల బీమా, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం వి లక్ష్మి, పద్మజ, దార్ల భాగ్యలక్ష్మి,  పుల్ల సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

Tags: