ప్రతి విద్యార్థి  మంచి  ర్యాంక్  సాధించాలి

ప్రతి విద్యార్థి  మంచి  ర్యాంక్  సాధించాలి

విశ్వంభర, మహేశ్వరం మహేశ్వరం మండలం వెండి తండా  గ్రామ పరిధిలోని  తలకొండపల్లి బాయ్స్  గురుకుల పాఠశాలలో టెన్త్ క్లాస్ విద్యార్థుల, తల్లిదండ్రుల తో ప్రత్యేక సమావేశం  నిర్వహించారు. ఈ సమావేశంలో స్కూల్ ప్రిన్సిపల్ సుధాకర్  మాట్లాడుతూ, ఈనెల 14 నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో  విద్యార్థులు స్కూలుకు మంచి ర్యాంకుతో మంచి గిఫ్ట్ ఇవ్వాలని, అలాగే మీరు గొప్ప గొప్ప స్థానాల్లో ఉండాలని  ప్రతి విద్యార్థి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి మీ తల్లిదండ్రులు ఆశయాలను నెరవేర్చాలని అన్నారు. అనంతరం  విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ, మా పిల్లలు చిన్నప్పటినుండి   ఇలాంటి స్కూల్ లో చదవడం మా అదృష్టమని అన్నారు.  మా పిల్లలకు ఇంత మంచి  స్కూల్ యజమాన్యం   దొరకడం  అదృష్టమని,  ఇలాంటి  టీచర్స్ ఉంటే మా పిల్లలు మంచిర్యాంకులు తీసుకొస్తారని  చెప్పారు. అలాగే  విద్యార్థులు తల్లిదండ్రులకు   పాదాభివందనం చేసి  ఆశీర్వాదం  పొందారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యజమాన్యం విద్యార్థులు, విద్యార్థుల  తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags: