షోరూంను ప్రారంభించిన మంత్రి సురేఖ
On
విశ్వంభర, హనుమకొండ: హన్మకొండ నక్కలగుట్ట లో నూతనంగా ప్రారంభమైన జోయాలుక్కాస్ గోల్డ్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నాగరాజు తొలుత రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షో రూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం యాజమాన్యం ఎమ్మెల్యే నాగరాజు ని శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు పాల్గొన్నారు.



