ప్రజా పాలన–పట్టణ ప్రగతి పాదయాత్ర
On
విశ్వంభర, అంబర్‌పేట : ప్రజా పాలన–పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అంబర్‌పేట మండల కార్యాలయం నుంచి పటేల్ నగర్ చౌరస్తా వరకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్ అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అపరిశుభ్ర ప్రాంతాలు, వెలగని వీధిదీపాలను పరిశీలించి వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ప్రశాంతి, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మారుతి దివాకర్, అధికారులు, సిబ్బంది, పార్టీ నాయకులు పాల్గొన్నారు.



