పోలీసు కుటుంబాలకు ఆర్థిక భరోసా
On
- ఎస్పీ నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: జిల్లా పోలీస్ నందు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించిన కృష్ణయ్య కుటుంబానికి జిల్లా పోలీస్ కార్యాలయం లో ఎస్పీ నరసింహ ఆరోగ్య భద్రత ఇన్సూరెన్స్ నగదు చెక్కును అందజేశారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఎస్పీ తెలిపారు. సిబ్బంది ఆరోగ్యం పై దృష్టి సారించాలి, వ్యాయామం చేయాలి, మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి అని కోరారు. సిబ్బంది కుటుంబాలకు ఆరోగ్య భద్రత పథకం బాసట గా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీసు సంఘం అధ్యక్షులు ఎస్ ఐ రామచందర్, సంక్షేమ ఆర్ఎస్ఐ సాయిరాం, సిబ్బంది పాల్గొన్నారు.



