విద్యార్థులు తమ వంతు సహకారం అందించాలి.
విశ్వంభర, హనుమకొండ :- కష్టపడి చదివి మంచి పౌరులుగా ఎదిగి సమాజ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు . సోమవారం హంటర్ రోడ్ శాయంపేట లోని శ్రీ వ్యాస ఆవాసం" లో సంతోష్ సులక్ష్య సేవా సమితి ఆధ్వర్యంలో పేద గిరిజన విద్యార్థులకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి స్కూల్ యూనిఫామ్ పంపిణి చేశారు . అనంతరం సీఎండీ మాట్లాడుతూ. రాబోయే తరానికి మీరే భావి భారత పౌరులు అన్నారు . భవిష్యత్తు మీచేతిలో ఉందని, తీర్చిద్దుకునే సత్తా కూడా మీ చేతిలోనే ఉందని, తల్లిదండ్రులకు , గురువులకు మీరు ఇచ్చే ఆస్తి గొప్ప వ్యక్తులుగా ఎదగడం అని అన్నారు . ఈ కార్యక్రమంలో శ్రీ వ్యాస ఆవాసం అధ్యక్షురాలు వసుంధర , డాక్టర్ శివసుబ్రహ్మణ్యం , శ్రీనివాస్ కార్యదర్శి , హన్మకొండ టౌన్ డి .ఈ సాంబ రెడ్డి , డి .ఈ ఎమ్ ఆర్టి అనిల్ కుమార్ , ఏడీఈ ఇంద్రసేనా రెడ్డి, ఏ.ఈ అరుణ్ తదితరులు పాల్గొన్నారు .



