ప్రజారోగ్యం పై ప్రత్యేక దృష్టి

ప్రజారోగ్యం పై ప్రత్యేక దృష్టి

  • అనంతగిరి వైద్యాధికారి డాక్టర్ ఫిరోజ్

విశ్వంభర, అనంతగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజా ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టిసారించిందని అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ఫిరోజ్ అన్నారు. దీనిలో భాగంగా మార్చి 4 బుధవారం అనంతగిరి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు అన్ని రకాల ప్రత్యేక వైద్యులచె మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి ఆరు రకాల వైద్య సేవలను గైనకాలజీ, చిన్నపిల్లల వైద్యులు, కంటి వైద్యులు, దంత వైద్యులు, ఎముకల వైద్యులు, షుగర్ బీపీ ఇతర వ్యాధుల కోసం జనరల్ మెడిసిన్ వంటి వైద్య సదుపాయాలను అందిస్తున్నామన్నారు. ఈ  అవకాశాన్ని అనంతగిరి, కోదాడ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అనంతగిరి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ఫిరోజ్ కోరారు.

Tags: