4న నగరంలో ట్రాఫిక్ మళ్లింపు

విశ్వంభర, హైదరాబాద్  : హోలీ మొహల్లా సిక్కు మత ఊరేగింపు నేపథ్యంలో మార్చి 4న నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సెంట్రల్ గురుద్వారా నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు శంకర్ షేర్ హోటల్, మెహబూబ్ గంజ్, ఎస్.ఏ. బజార్ మసీదు, బర్తన్ బజార్, స్వస్తి మిర్చి, బేగంబజార్ ఛత్రి, చూడీ బజార్, రాణి అవంతి బాయి విగ్రహం, టక్కర్‌వాడి టి-జంక్షన్, గాంధీ విగ్రహం, పురానాపూల్ ఎక్స్ రోడ్, పురానాపూల్ దర్వాజా మీదుగా కిషన్ బాగ్ గురుద్వారా, అత్తాపూర్ బరంబాలా గురుద్వారా వరకు కొనసాగుతుంది. సాయంత్రం 3.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు మళ్లింపులు అమల్లో ఉంటాయి. మళ్లింపులు ఇవి: అఫ్జల్ గంజ్ నుంచి ఎం.జె. మార్కెట్ వైపు వెళ్లే వాహనాలను అఫ్జల్ గంజ్ టి-జంక్షన్ వద్ద సెంట్రల్ లైబ్రరీ వైపు మళ్లిస్తారు. ఎం.జె. మార్కెట్ నుంచి అఫ్జల్ గంజ్ వైపు వచ్చే వాహనాలను మలకుంట, అలాస్కా, ఛత్రి, ఎం.జె. బ్రిడ్జ్ వైపు మళ్లిస్తారు. ఛత్రి ప్రాంతంలో ఊరేగింపు ఉన్న సమయంలో ఎం.జె. బ్రిడ్జ్ నుంచి వచ్చే వాహనాలను జుమ్మేరాత్ బజార్, డెంటల్ కాలేజీ వైపు మళ్లిస్తారు. జియాగూడ, కార్వాన్ నుంచి పురానాపూల్ దర్వాజా వైపు వచ్చే వాహనాలను పురానాపూల్ ఎక్స్ రోడ్ వద్ద జుమ్మేరాత్ బజార్, ఎం.జె. బ్రిడ్జ్ వైపు మళ్లిస్తారు. గాంధీ విగ్రహం నుంచి పురానాపూల్ దర్వాజా వైపు వచ్చే వాహనాలను 100 ఫీట్ల రోడ్డు వైపు మళ్లిస్తారు. ప్రయాణికులు ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్‌బుక్ పేజీ, @HYDTP ఎక్స్ ఖాతాను అనుసరించాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం 9010203626 నంబర్‌ను సంప్రదించవచ్చని ,  నగర పౌరులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags: