ఫాగింగ్ మిషన్ వితరణ
విశ్వంభర, అంబర్‌పేట : దోమల బెడద పెరిగిన నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు స్వచ్ఛందంగా ఫాగింగ్ మిషన్ అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. అంబర్‌పేట డివిజన్‌లో దోమల సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఉద్యమ నాయకుడు మల్లికార్జున యాదవ్ తన సొంత డబ్బులతో నూతన ఫాగింగ్ మిషన్ సమకూర్చారు. అంబేద్కర్ విగ్రహం, బాపునగర్ ప్రాంతంలో ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మల్లికార్జున యాదవ్ స్వయంగా మిషన్ సమకూర్చడమే కాక దాని నిర్వహణ బాధ్యతలు తీసుకోవడం ప్రశంసనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఇతర డివిజన్లలో కూడా ఇలాంటి చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, లవంగం ఆంజనేయులు, రామారావు యాదవ్, లింగారావు, నరసింహారెడ్డి, ఆకుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.



