రేడియోగ్రాఫర్స్ క్యాలెండర్ ఆవిష్కరణ
విశ్వంభర, హైదరాబాదు: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన నివాసంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ రేడియోగ్రాఫర్స్ అండ్ టెక్నాలజిస్ట్ తెలంగాణ స్టేట్ చాప్టర్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్‌తోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోగ నిర్ధారణలో రేడియోగ్రాఫర్స్ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. వైద్యరంగంలో రేడియోగ్రాఫర్స్, టెక్నీషియన్‌ల సేవలు ప్రశంసనీయమని అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఆధునిక వైద్యరంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని రేడియోగ్రాఫర్స్‌కు సూచించారు. నాణ్యమైన వైద్యసేవలందించడంలో సాంకేతిక నైపుణ్యం ఎంతో అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు ఎం.ఏ. హన్సారీ, జనరల్ సెక్రటరీ జి. గంగాధర్, ఫైనాన్స్ సెక్రటరీ బండి లింగరాజు, కార్యవర్గ సభ్యులు టోనీ ఆంటోనీ, రహిమా, మానస, మోత్కూరు శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, బి. సురేష్, విద్యాసాగర్, గణేష్, ప్రకాష్, సాయి చందు, నాగరాజు, అర్జున్, భావన, నాగార్జున, శ్రీనివాస్ నాయక్, ఏం. రాజేష్, కిరణ్ నాయక్, ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



