108 వాహనం తనిఖీ
On
విశ్వంభర, మహేశ్వరం: కందుకూరు మండల ప్రాథమిక ఆసుపత్రి ఆవరణలో 108 అంబులెన్స్ ను సోమవారం జిల్లా అధికారులు జాన్ సాహెబ్, రాజబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బంది పనితీరును పరిశీలించారు. అంబులెన్స్ లో ఉన్న ఆక్సిజన్ సరఫరా చెక్ చేశారు. రికార్డులను పరిశీలించారు. అత్యవసర సమయంలో ఫోన్ చేసిన వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించారు. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సిబ్బంది కుమార్, భూపతి, యాదయ్య, బాలకృష్ణ, తదితరులు ఉన్నారు.



