ముమ్మరంగా రోడ్ల మరమ్మతులు  

ముమ్మరంగా రోడ్ల మరమ్మతులు  

విశ్వంభర, పిర్జాదిగూడ: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని 9వ డివిజన్ (మేడిపల్లి) 10వ డివిజన్ (పీర్జాదిగూడ) వ్యాప్తంగా ప్రధాన రహదారులు గుంతలమయంగా మారి వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి  ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ  డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజకి వినతి పత్రం అందజేశారు. రహదారుల దుస్థితి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాలని ఆయన అధికారులను కోరారు. తుంగతుర్తి రవి  వినతిపై డిప్యూటీ కమిషనర్ శైలజ  సానుకూలంగా స్పందించారు. వినతి పత్రం అందిన కొద్ది సమయంలోనే ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించి, యుద్ధ ప్రాతిపదికన రోడ్ల ప్యాచ్ వర్క్ పనులను ప్రారంభించారు. ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందించి, పనులు ప్రారంభించిన డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజకి  మున్సిపల్ సిబ్బందికి తుంగతుర్తి రవి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్యాచ్ వర్క్ పనుల పర్యవేక్షణ లో భాగంగా తుంగతుర్తి రవితో పాటు ప్రణయ్, మహ్మద్ మజర్, నాగరాజు, కాటపాక సంతోష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Tags: