రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్టు తొలగింపు
విశ్వంభర, బర్కత్ పుర : హైదరాబాదు బర్కత్పుర రాఘవేంద్ర స్వామి ఆలయం ఎదురుగా బస్ స్టాప్ వద్ద ఈదురు గాలులతో వంగిపోయిన భారీ చెట్టును గురువారం జిహెచ్ఎంసి సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు కలిసి తొలగించారు. చెట్టు వంగిపోవడంతో ప్రమాద పరిస్థితి, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో వెంటనే చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా చెట్టును తొలగించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ కౌశిక్, ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది నారాయణరెడ్డి, రవి, రాంబాబు, రామిరెడ్డి, జిహెచ్ఎంసి సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.